Allu Arjun: నేడు నాంపల్లి కోర్టులో హాజరుకానున్న అల్లు అర్జున్ ..! 9 d ago
సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ హాజరుకానున్నారు. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. నేటితో 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ ముగియనున్నది. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నాంపల్లి కోర్టులో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు తెలపనున్నారు.